వంటా వార్పు: ఎంతో రుచిక‌ర‌మైన `నువ్వుల ఆవకాయ` ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
మామిడికాయ ముక్కలు- కేజీ
నువ్వులు- పావు కేజి
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 250 గ్రాములు
ఆవాలు- ఒక‌టిన్న‌ర టీ స్పూన్‌

 

జీలకర్ర- ఒకటిన్నర టీస్పూన్‌
ఆవపొడి- అర క‌ప్పు గ్రాములు
పసుపు- ఒక టీ స్పూన్ 
ఉప్పు- 250 గ్రాములు

 

నువ్వుల నూనె- అర కేజి
జీలకర్ర పొడి- 25 గ్రాములు
మెంతిపొడి- ఒక టీ స్పూన్‌
ఇంగువ- అర టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి,  ఆవపొడి, మెంతిపొడి, పసుపు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపేయాలి. నూనె గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలపాలి. 

 

దీనివల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది. ఇక పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. అన్ని ముక్కలకు మసాలా అంటిన తర్వాత శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూతపెట్టి ఉంచాలి. మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వేడి వేడి రైస్‌తో తింటే అదిరిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: