వంటా వార్పు: యమ్మీ యమ్మీ `ఈస్టర్ డేట్స్ కేక్`
కావాల్సిన పదార్థాలు:
మైదాపిండి - ఒక కప్పు
ఖర్జూరాలు- అరకప్పు
ఎండబెట్టి దంచిన అల్లం పొడి- చిటికెడు
తరిగిన జీడిపప్పు- ఐదు స్పూన్లు
పాలు- ముప్పావు కప్పు
చక్కెర- ముప్పావు కప్పు
లవంగాల పొడి- అరచెంచా
బేకింగ్ పౌడర్- ఒక టీ స్పూన్
దాల్చినచెక్క పొడి- అరచెంచా
నూనె- అరకప్పు
తయారీ విధానం: ముందుగా ఖర్జూరాల్లోని గింజలు తీసేసి ముక్కలు చేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి తిప్పి మరింత మెత్తగా అయ్యాక తీసి పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, పాలు, చక్కెర, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి, అల్లం పొడి వేసుకుని బాగా కలుపుకొని, అందులో ముందు సిద్ధం చేసుకొన్న ఖర్జూరం మిశ్రమం, తరిగిన జీడిపప్పు వేసి మరోమారు బాగా కలపాలి. చివరగా తగినంత నూనె వేసి కలిపాలి.
ఆ తర్వాత కేక్ గిన్నె లోపలి భాగానికి కొద్దిగా వెన్న రాసి తయారైన మిశ్రమాన్ని అందులో పోసి ఓవెన్లో పెట్టి 350 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పడు దీన్ని బయటకు తీసి మీకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ తో అలంకరించుకుంటే సరిపోతుంది. అంతే యమ్మీ యమ్మీ ఈస్టర్ డేట్స్ కేక్ రెడీ..!