వంటా వార్పు: ఎంతో సులువుగా `మష్రూమ్‌ చిప్స్‌`

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
మష్రూమ్స్‌- 300 గ్రా 
వైట్‌ పెప్పర్‌పొడి- అర టీస్పూన్
వెల్లుల్లి- మూడు రెబ్బ‌లు
నూనె- స‌రిప‌డా

 

పచ్చిమిర్చి- మూడు
ఉప్పు- రుచికి తగినంత
కారం- అర టీస్పూన్
బ్రెడ్‌గమ్‌- వంద‌ గ్రా 

 

చిల్లీ పేస్ట్‌- ఒక‌ టీస్పూన్
కరివేపాకు- రెండురెబ్బలు
కొత్తిమీర- కొద్దిగా
నిమ్మ‌ర‌సం- కొద్దిగా

 

తయారీ విధానం:
ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రం చేసికుని ఉడికించాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి.. అందులో చిల్లీపేస్ట్‌, వైట్‌పెప్పర్‌ పొడి, ఉప్పు వేసి బాగా కలుపాలి. ఇప్పుడు వీటిని బ్రెడ్‌గమ్‌లో అద్ది నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. త‌ర్వాత మరొక కడాయిలో నూనె వేడిచేసి దానిలో తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. 

 

అందులో ముందుగా వేయించిన మష్రూమ్స్‌ వేసి కలుపాలి. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు సరిచూసుకుని కాసేపు మ‌గ్గ‌నిచ్చి స్టౌ ఆఫ్ చేయాలి. చివ‌రిగా కాస్త నిమ్మ‌ర‌సం పిండి స‌ర్వింగ్ ప్లేట్‌లో తీసుకుంటే స‌రిపోతుంది. అంతే మష్రూమ్‌ చిప్స్ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: