ఏపీ: జగన్ చేస్తే అలా..చంద్రబాబు చేస్తే ఇలా..?
కమిటీలలో చంద్రబాబు మాట్లాడుతూ సమాజంలో అధిక సంఖ్యలో జనాభా ఉన్న కులాలను రాజకీయాలలో ప్రాతినిధ్యం కల్పించాలని.. టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి అదే విధానాన్ని పాటిస్తున్నామని తెలిపారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించింది కూడా టిడిపి పార్టీనే అని మిగిలిన కులాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేశారు. జిల్లా కమిటీలలో ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు కాకుండా 32 మంది సభ్యులు ఉండగా వాటిని 40 కి పెంచాలంటూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా 26 జిల్లాలకు సంబంధించి కులాలవారీగా అధ్యయనం చేసి సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ అందించారు.
ఇందులో ఓసిలకు 34 %, బీసీలు 41%, ఎస్టీలు 7%, ఎస్సీలు3%, ఇతరులు 4 % ఉన్నారని చంద్రబాబు తెలియజేశారు. మైనార్టీ కులాలకు సంబంధించి 40 వరకు ఉన్నారని, ఇందులో ఎస్సీలకు ఒక శాతం పెంచాలని, మైనార్టీలకు మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే మహిళలకు 33% ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. ఈనెల 16వ తేదీన సమావేశమై జిల్లా కమిటీలను ఖరారు చేద్దామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఇది సాధారణంగా అన్ని పార్టీలలో జరిగే తంతు..కాని టిడిపిలో మాత్రం ఏదైనా చిన్న విషయాన్ని కూడా మరింత ఎక్సైటింగ్ అయ్యేలా చేస్తూ ఉంటారు సోషల్ మీడియా..ప్రతిపక్ష పార్టీ వాళ్లు చేస్తే అది రొటీన్ వార్త.. కానీ అధికార పార్టీ చేస్తే హైలెట్ చేస్తూ ఎక్కడైన చర్చించేలి అన్న విషయంపై టిడిపి సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది. నిరంతరం ప్రజల మధ్య చంద్రబాబు పేరు వినిపించేలా చేస్తూ పక్క ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారు.