వంటా వార్పు: టేస్టీ టేస్టీ `ఆలూ కొత్తిమీర రైస్‌`

Kavya Nekkanti

కావాల్సిన పదార్థాలు:
బియ్యం- ఒక కిలో
కొత్తిమీర- రెండు కట్టలు
పచ్చిమిర్చి- ఐదు

 

బంగాళదుంపలు- అరకిలో
ఉప్పు- రుచికి స‌రిప‌డా
నూనె- సరిపడా

 

తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని క‌డిగి వండుకుని పక్కన పెట్టుకోవాలి. త‌ర్వాత బంగాళదుంపలను చెక్కుతీసి చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి దాంట్లో పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద‌ పాన్‌ పెట్టుకుని అందులో సరిపడా నూనె వేసుకోవాలి. బాగా కాగాక చిన్నచిన్న ముక్కలుగా తరిగిపెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఐదు నిమిషాలపాటు దోరగా వేగించుకోవాలి. 

 

ఆ తర్వాత రుబ్బిపెట్టుకున్న కొత్తిమీర పేస్టుని కూడా వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నం కూడా వేసి క‌లిపాలి. అలాగే చివ‌రిలో కొత్తిమీర జ‌ల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ ఆలూ కొత్తిమీర రైస్ రెడీ..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: