వంటా వార్పు: సండే స్పెషల్ `ఫిష్ టిక్కా`
కావాల్సిన పదార్థాలు:
చేపలు- ఇక కిలో
పెరుగు- ఒక కప్పు
కారం- రెండు స్పూన్లు
గరంమసాలా- అర టీస్పూన్
ధనియాల పొడి- అర టీస్పూన్
ఉప్పు- రుచికి తగినంత
మిరియాల పొడి- అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు
సెనగపిండి- రెండు టేబుల్‌స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
పసుపు- పావు టీస్పూన్
నిమ్మరసం- కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా చెప్పలను తీసుకుని శుభ్రం చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పడు పెరుగు తీసుకొని.. అందులో నీళ్లుంటే పలుచని వస్త్రంలో పోసి గట్టిగా పిండి నీళ్లు తీసేయాలి. తరువాత కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి, కారం, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు పట్టించాలి.
ఆ తర్వాత పెరుగు, సెనగపిండి కూడా వేసి ముక్కలకు సమంగా పట్టేలా కలపాలి. ఈ చేప ముక్కలను నాలుగు గంటల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు చేప ముక్కలను టూత్ పిక్స్‌కు గుచ్చి ఓవెన్‌లో పావు గంట పాటు ఉడికించాలి. ఆతర్వాత అవి బయటకు తీసి వేడి మీద గరంమసాలా, ధనియాల పొడి చల్లుకుంటే సరిపోతుంది. అంతే వేడి వేడి ఫిష్ టిక్కా రెడీ..!