మాంసహారులకు అదిరిపోయే `మటన్ ఖీమా`

Kavya Nekkanti

కావాల్స‌న ప‌దార్థాలు:
మటన్ ఖీమా- అర కేజీ
టమోటాలు- రెండు  
ఉల్లిపాయలు - రెండు
గరం మసాలా-  ఒక స్పూన్‌

 

అల్లం, వెల్లుల్లి పేస్ట్‌-  రెండు స్పూన్లు
కారం- ఒక స్పూన్‌
నూనె- స‌రిప‌డా

 

కరివేపాకు- రెండు రెబ్బలు
ఉప్పు- రుచికి సరిపడా 
కొత్తిమిర త‌రుగు- కొద్దిగా
పసుపు- చిటికెడు

 

తయారీ విధానం:
ముందుగా నీటిలో ఖీమాను బాగా కడిగి నీరు వార్చి పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టౌ మీద‌ పాన్ పెట్టి అందులోనూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, అల్లం,వెల్లుల్లి మిశ్రమం, పసుపు, కారం వేసి కలిపి నాలుగు నిమిషాలు వేయించాలి. తర్వాత అందులో  ఖీమా, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

 

స్లో ఫ్లేమ్ మీద పెట్టి అందులోని నీరు పూర్తిగా ఇగిరిపోయే వ‌ర‌కు ఉండాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమాటా, గరం మసాలా పొడి  వేసి కలిపి కప్పు నీరు పోసి మెత్తగా ఉడికేవరకు ఉంచాలి. నీరంతా ఇరిగిపోయాక చివ‌రిలో కొత్తిమీర చల్లి స్టౌ ఆప్ చేసి దింపుకొంటే స‌రిపోతుంది. అంతే మాంసహారులకు వేడి వేడి మటన్ ఖీమా రెడీ. రైస్‌తో లేదా రోటీతో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: