ఈ చక్కటి చిట్కాతో అరికాళ్ల మంట సమస్య మాయం...

Gowtham Rohith
అరికాళ్ల మంట సమస్య అనేక వ్యాధుల లక్షణాలలో ఒకటి. రకరకాల కారణాల వలన ఈ సమస్యని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూ ఉంటారు. వీటివలన వేడిగా, సూదులు గుచ్చినట్లుగా నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అవయవాలకు రక్త ప్రసరణ తక్కువగా జరగడం వలన ఈ పాదాలు మంటలు ఏర్పడతాయి. ప్రధానంగా, కాళ్ళల్లో దెబ్బతిన్న నరాల వలన, వయసు పైబడుతున్నకొద్ది నరాలు బలహీనపడటం వలన ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లో పగుళ్ళు ఏర్పడటం వల్ల అరికాళ్లు చర్మం పొరలుగా ఊడిపోవడం వలన కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అరికాళ్ళ మంటలు, నొప్పి తగ్గిడానికి మర్దన కూడా ఒక మంచి మార్గం. పాదరక్షలు లేకుండా గడ్డి, ఇసుక మీద నడవటం వలన పాదాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కానీ, గట్టిగా ఉన్న నేలపై నడవకూడదు. ఎందుకంటే దీనివలన నొప్పి, మంటలు మరింత పెరుగుతాయి. గోరువెచ్చని నీటిలో అరికాళ్ళను ఉంచితే పావుగంటలో అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. అరికాళ్ల మంటల సమస్యను నివారించేందుకు ఓ చక్కటి చిట్కా ఉంది. అది ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.


కావాల్సిన పదార్ధాలు:సీమ గుగ్గిలం-5 గ్రాములు,
కొబ్బరి నూనె-50 గ్రాములు
నీళ్ళు-50 గ్రాములు
తయారు చేయు విధానం:

 సీమ గుగ్గిలంని మెత్తగా పొడిలా నూరుకోవాలి. ఇలా నూరిన సీమ గుగ్గిలంని కొబ్బరి నూనె లో వేసుకుని కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సీమ గుగ్గిలం కొబ్బరి నూనె లో కరిగే అంతవరకు కలుపుకుంటూ ఉండాలి. అది కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.


ఇప్పుడు దీనిలో 50 గ్రాముల నీళ్ళను పోసుకుని, మజ్జిగ చిలికే కవ్వంతో బాగా చిక్కగా పేరుకున్న నెయ్యిలా వచ్చే అంత వరకు చిలుకుతూ ఉండాలి.అలా చిలకగా వచ్చే మిశ్రమాన్ని పగిలిన మడాలకు,అరికాళ్ళ మంటలకు మరియు బాగా తల నొప్పికి గనుక రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: