మామిడికాయతో మటన్ కాంబినేషన్ అదుర్స్..!
మామిడికాయతో పప్పు, పులిహోర, పులుసు, ఆవకాయ, కూరలు, మామిడి సలాడ్స్, మామిడి డ్రింక్స్, మ్యాంగో మిల్క్ షేక్ ఇలా ఒకటేంటి రకరకాలుగా ఇలా ఎన్నో తయారుచేసుకుంటాము. కాని అదే మామిడికాయతో మాంసాహారం కూడా తయారు చేసుకోవచ్చు. చేపల పులుసుకు మామిడి కాయా జోడిస్తే ఆహా ఆహా రుచి భలే ఉంటుంది. మరీ మీరు టేస్ట చేయాలంటే ఈ మామిడి చేపల పులుసు నేర్చుకోవాల్సిందే. కావాలసిన పధార్థాలు : చేపలు : ½ కేజి మామిడికాయ : 1 ఉల్లిపాయలు : 4 వెల్లుల్లి రెబ్బలు : 4-6 జీలకర్ర : ½ టీస్పూన్లు పసుపు : ½ టీ స్పూన్లు ధనియాలు : 2 స్పూన్లు పచ్చిమిర్చి : 6-8 కరివేపాకు : 1 కప్ కొత్తిమీర : ఒక కట్ట మిరపపొడి : 2 టీ స్పూన్లు ఉప్పు : రుచికి తగ్గట్టు నూనె : సరిపడా
తయారు చేయు విధానం : ముందుగా చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి వాటిపై ఉప్పు, పసుపు పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలను మెత్తగా నూరుకొని ఒక పాత్రలో ఉల్లిపాయలు వేస్తే, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీరలను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఇప్పడు ఈ విషయాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న చేపలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరవాత మామిడికాయను ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పడు మరో గిన్నెలో కొద్దిగా నూనె వేసి మషాల పట్టించి పెట్టుని చేపముక్కలను అందులో వేసి 2 నిమిషాలు వేయించి కొద్దిగా నీళ్లు పోయాలి.
తర్వత అందులోనే ముందుగా ఉడికించుకున్న ఈ మామిడి కాయ మిశ్రమాన్ని చేపముక్కలు ఉడుకుతున్న పాత్రలో వేసి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలి. కావాలనుకుంటే మామిడి కాయ ముక్కలను కూడా కొద్దిగా చేర్చుకోవచ్చు, చేప ముక్కలు ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత దించుకోవాలి