మరో మహిళతో భర్త ఎఫైర్.. భార్య చేసిన పనికి అందరూ షాక్?
ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. అక్రమ సంబంధం కారణంగా మరో ప్రాణం బలయింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త తరచూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య దారుణంగా భర్తను హాత మార్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. తాడిపత్రికి చెందిన అబ్దుల్ భాష ఆరెళ్ల క్రితం ఆయేషా అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నాడు. లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు అబ్దుల్. అయితే ఇటీవల మద్యానికి బానిసగా మారిపోయాడు. అంతేకాదు భార్యకు ద్రోహం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధానికి కూడా తెరలేపాడు.
రోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య ఆయేషాతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో భర్త వేధింపులతో ఆయేషా విసిగిపోయింది. ఇలాంటి భర్త తనకు అక్కర్లేదు అని భావించింది. చివరికి ఇటీవల అర్ధరాత్రి సమయంలో భర్త నిద్రిస్తుండగా రోకలి బండతో దారుణంగా తలపై కొట్టి హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనగా మారిపోయింది.