వంటా వార్పు: `చింతచిగురు పులిహోర`.. తిన్నారంటే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు..!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
బియ్యం - రెండు కప్పులు
చింత చిగురు - ఒక కప్పు
శెనగపప్పు - ఒక టీ స్పూన్‌

 

ఎండుమిర్చి - ఐదు
ఆవాలు - అర టీస్పూన్‌
ధనియాలు - ఒక టీస్పూన్
ఉప్పు - రుచికి స‌రిప‌డా

 

కరివేపాకు - నాలుగు రెబ్బలు
వేరుశెనగలు - నాలుగు స్పూన్లు
మినపప్పు - ఒక టీ స్పూన్‌

 

పసుపు - అర‌ టీస్పూన్‌
క్యారెట్ తురుము - నాలుగు స్పూన్లు
కొత్తిమీర ‌- అర క‌ప్పు
ప‌చ్చిమిర్చి - రెండు

 

త‌యారీ విధానం:
ముందుగా బియ్యాన్ని క‌డిగి అన్నం వండుకోవాలి. మ‌రియు చింత చిగురు కూడా కడుక్కుని తడి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి చింగచిగురు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, శెనగపప్పు, వేరుశెనగపలుకులు వేసి వేయించాలి. 

వాటిని తీసి పక్కన పెట్టి చల్లార్చాలి. ఇప్పుడు వేయించిన దినుసులు, చింతచిగురు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత మళ్లీ స్టవ్ మీద పాన్‌ పెట్టి నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, పసుపు, రెండు ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. 

అవి వేగాక‌.. అందులో చింతచిగురు పేస్ట్‌ కూడా వేసి కలపాలి. అనంత‌రం ముందుగా వండిన అన్నాన్ని, ఉప్పుని అందులో వేసి బాగా కలపాలి. ఇక చివ‌రిగా క్యారెట్ తురుము మ‌రియు కొత్తిమీర వేస్తే స‌రిపోతుంది. అంతే చింగచిగురు పులిహోర రెడీ అయిన‌ట్లే. వేడి వేడిగా దీన్ని తింటే అదిరిపోతుంది. మ‌రి ఈ టేస్టీ చింతచిగురు పులిహోర రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: