ఎంతో సులువుగా ` చింత చిగురు చికెన్ `

Kavya Nekkanti
కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్‌- పావుకేజీ
చింతచిగురు- పావుకేజీ
కొబ్బరి తురుము- 2 టీస్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్‌


అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్‌
గరంమసాల- టీస్పూన్‌
ఆవాలు- టీస్పూన్‌
ఉప్పు- తగినంత
నూనె- సరిపడా


పుదీనా- కట్ట
ఉల్లిపాయలు- 2
కారం- 2 టీస్పూన్లు
పసుప- చిటికెడు
కొత్తిమీర- కట్ట


తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాన్‌ తీసుకొని నూనె వేసి, కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్న తరువాత జీలకర్ర వేసుకోవాలి. కాసేపయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఆ త‌ర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరి కాసేపు వేగించుకోవాలి.


ఇప్పుడు కొబ్బరి తురుము వేయాలి. కాసేపటి తరువాత చికెన్‌ వేసి ఉడికించుకోవాలి. చికెన్‌ ముక్కలు ఉడికిన తరువాత చింతచిగురు వేసి మరి కాసేపు ఉడికించాలి. చివరగా గరం మసాల వేసుకొని రెండు నిమిషాలు అయ్యాక కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే చింత చిగురు చికెన్ రెడీ. రైస్‌తో లేదా రోటీతో దీని కాంబినేష‌న్ చాలా టేస్టీగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: