రిలయన్స్‌ జియో వినియోగదారులకు శుభవార్త

Vamsi
భారత దేశంలో జియో నెట్ వర్క్ వచ్చినప్పటి నుంచి ఇతర నెట్ వర్క్ ముచ్చెమటలు పట్టిస్తుంది.  దాంతో ఇతర నెట్ వర్క్ లు కూడా ఛార్జీలు తగ్గిస్తూ వస్తున్నాయి.  జియో ప్రధాన సభ్యత్వం( ప్రైమ్‌ మెంబర్‌షిప్‌) ను కంపెనీ మరో ఏడాది పాటు పొడిగించింది. గతేడాది రి లయన్స్‌ జియో ప్రైమ్‌ సభ్యత్వానికి 99 రూపాయలు వసూలు చేసి,ఏడాది పాటు ఉచితంగా జియో టీ వీ, జియో సినిమా,జియో మ్యూజిక్‌, జియో మ్యాగజైన్‌ తదితర కంపెనీకి చెందిన యాప్స్‌ సేవలు అందించింది.

అయితే కొత్తగా జియో సిమ్‌ తీసుకునే వారు ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ కోసం 99రూపాయలు చెల్లించి, ఏడాది పాటు ఉచిత సేవలు పొందాల్సి ఉంటుంది. గతంలో ప్రైమ్‌ నెంబర్‌ షిప్‌న్నవారు తమ సభ్యత్వాన్ని కూడా ఉచితంగా రెన్యువల్‌ చేసుకోవచ్చు. మొదట జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్నవారు తమ స్మార్ట్‌ ఫోన్‌లో మైజియో యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి లేదా ఓపెన్‌ చేయాలి.

మైజియో యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ ప్లేస్టోర్‌లలో అందుబాటులో ఉంది. మైజియోయాప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ,..మీ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. మొదట జియో ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ తీసుకున్నప్పుడు సిమ్‌ యాక్టివేట్‌ చేసుకున్న స్మార్ట్‌ ఫోన్‌నే ఇప్పుడు వినియోగించాలి. అప్పుడు అటోమేటిక్‌గా నెట్వర్క్‌ గుర్తించి, వినియగదారున్ని లాగిన్‌ చేస్తుంది. లాగిన్‌ అయిన వెంటనే మీకు జియో 4జీ ఆన్‌ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: