టాటాకు నానో కారు ఆలోచన ఎలా పుట్టిందంటే?
అయితే.. రతన్ టాటా మరణించిన నేపథ్యంలో ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రతన్ టాటా తీసుకువచ్చిన... నానో కార్ గురించి... అందరూ చర్చించుకుంటున్నారు. నానో కార్ ఆటోమొబైల్ పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి... కారును రతన్ టాటా తీసుకువచ్చారు. సామాన్యుల కోసం అది తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో 2008లో రతన్ టాటా నానో కారును తీసుకురావడం జరిగింది. స్కూటర్ల పై తల్లిదండ్రుల మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని భావించి ఈ కారును తయారు చేసినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది.
అయితే పలు కారణాలతో ఇది మార్కెట్లో నిలువ లేకపోవడంతో కార్ల తయారీని టాటా గ్రూప్ నిలిపివేసింది. కానీ సామాన్యులు చాలామంది ఇప్పటికీ.. ఈ కారును వాడుతున్నారు. అలాగే... అతి త్వరలోనే రెండు లక్షల రూపాయల లోపు... ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చే దిశగా... రతన్ టాటా అడుగులు వేస్తున్నారు. కానీ అంతలోనే ఆయన కన్నుమూశారు.
అయినప్పటికీ టాటా కంపెనీ ఆ దిశగా ముందుకు వెళుతుందని కొంతమంది చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా... గత కొన్ని రోజులుగా ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత వారం కిందట కూడా... రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. కానీ నేను ఆరోగ్యంగా ఉన్నానని స్వయంగా రతన్ టాటా ప్రకటించారు. ఈ మేరకు పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రకటన చేసిన వారం తిరగకముందే... రతన్ టాటా మరణించారు.