ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి షాక్.. భారీగా తగ్గనున్న ఆ రేట్లు!
జపాన్, యుఎస్ లల్లో ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో ఆర్బీఐ కూడా వడ్డీ రేటును తగ్గించేందుకు చూస్తోంది. యుఎస్ ఫెడ్ షెడ్యూల్డ్ మీటింగ్ తర్వాత ఎఫ్డీ వడ్డీ రేటు తగ్గింపు ఉండనుంది. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే వడ్డీ రేట్లు తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 ఆర్థిక ఏడాది చివరి నాటికి ఇండియాలో 100 బీపీఎస్ వరకూ ఎఫ్డీ రేటు తగ్గింపు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతన్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలవరకూ తగ్గుతూ వచ్చింది. అయితే జూన్ లో మళ్లీ 5.08 శాతం పెరగడంతో వడ్డే రేట్లు ఇప్పట్లో తగ్గవని పలువురు చెబున్నారు. అయితే యుఎస్ ఫెడ్ సెప్టెంబర్ నెలలో వడ్డీ రేటును తగ్గిస్తే అప్పుడు పరిస్థితి మారొచ్చని అంటున్నారు. ఇటువంటి సమయంలో పెట్టుబడిదారులు ఎఫ్డీలను అలానే ఉంచేయాలి. ఎఫ్డీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రేట్లకు మరికొంత సమయం లాక్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు