మోదీ సంస్కరణలు.. ఇండియా చైనాను దాటేస్తుందా?

Chakravarthi Kalyan
నిజం నాలుగు అడుగులు వేసే లోగా అబద్ధం ఆరుగురిని చుట్టి వస్తోంది అనేది పెద్దల మాట. మన ప్రధాని మోదీ విషయంలో ఇదే జరిగింది అని బీజేపీ నేతలు అంటుంటారు. గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు జరిగాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.  ఇదే సాకుతో మోదీని అమెరికా రాకుండా వీసా నిరాకరించింది ఆ దేశం. ఇప్పుడు ప్రధాని కోసం ఎర్ర తివాచీ పరుస్తోంది.

మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శిస్తుంటారు.  గుజరాత్ లో కాంగ్రెస్ కు అడ్డు తగులుతారనే భావించి తమ చేతిలో ఉన్న మత శక్తులను ఉపయోగించి గోద్రా అల్లర్లు సృష్టించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తుంటారు.  గోద్రాలో రైలు తగల బెట్టిన తర్వాత జరిగిన అల్లర్ల ను అడ్డు పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా మోదీ ప్రతిష్ఠ మసక బారేలా విష ప్రచారం చేశారని ఇప్పటికి వారు వాదిస్తుంటారు.

గోద్రా అల్లర్ల తర్వాత దేశంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా గుజరాత్ అవతరించింది. అంతకుముందు ఎక్కడ ఉంటుందో తెలియని గుజరాత్ ను తొలిస్థానంలో నిలబెట్టారు మోదీ. ఆయన ప్రధాని అయితే  మత కల్లోలాలు జరుగుతాయి అని విపక్షాలు విపరీతంగా ప్రచారం చేశాయి. కానీ ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ మత కలహాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు.  

పీవీ నరసింహరావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు కొనసాగిస్తూ జీఎస్టీ, నోట్ల రద్దు వంటివాటిని అమలు పరుస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇతర దేశాలు ఇప్పుడు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. డెంగీ విపత్తు తర్వాత చైనాలో చేపట్టిన సంస్కరణల మూలంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. మోదీ ప్రధాని అయ్యాక తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థను దాటేస్తుందని అమెరికాకు చెందిన బిజినెస్ టైకూ రేడాలియో అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: