వామ్మో.. నో కాస్ట్ ఈఎంఐ వెనుక ఇంత రహస్యం ఉందా?

praveen
ఇటీవల కాలంలో ఎలాంటి వస్తువు కావాలన్నా కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ వేదిక గానే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక మరికొంతమంది ఆన్లైన్లో కొనుగోలు పై ఆసక్తి చూపకుండా నేరుగా శాపింగ్ మాల్ కి వెళ్లి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు.  ఇలా షాపింగ్ మాల్ కి వెళ్ళి కొనుగోలు చేసిన లేదా ఆన్లైన్లో కొనుగోలు చేసిన అందరూ కావాలనుకున్నది మాత్రం నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్. ఇటీవలికాలంలో  నో కాస్ట్ ఈఎంఐ ద్వారానే ప్రతి ఒక్కరూ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు.

 ఇక ఈ ఆఫర్ ద్వారా వస్తువు ధర కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదని ఇక ఎంతో బెనిఫిట్ ఉంటుంది అంటూ అందరూ భావిస్తూ ఉంటారు. అందుకే ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇక ఈ వస్తువు పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందుబాటులో ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. మరికొంత మంది ఇలాంటి ఆఫర్ అందుబాటులో ఉన్నప్పుడే వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. నేటి రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా నో కాస్ట్ ఈఎంఐ అనేది సర్వసాధారణంగా  మారిపోయింది. అంతా బాగానే ఉంది కానీ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా వస్తూ ఉన్న ధరకే అమ్మడం చేస్తూ ఉంటారు.

 ఇలా చేయడం వల్ల అసలు కంపెనీలకు లాభం ఎలా వస్తుంది అన్న డౌట్ చాలామందిలో వచ్చే ఉంటుంది. కానీ అందరికీ తెలిసిన నో కాస్ట్ ఈఎంఐ వెనక ఒక మతలబు దాగి ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు. మీరు కొనుగోలు చేయాలనుకునే వస్తువుకి నేరుగా నగదు చెల్లించి కొంటె వస్తువుపై డిస్కౌంట్ ఇస్తారు. ఒకవేళ ఈఎంఐ లో కొంటే మాత్రం డిస్కౌంట్ ఇవ్వరు. ఇందులోనే ఈఎంఐ వడ్డీ వచ్చేలా చూసుకుంటారు. మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు క్యాష్ చెల్లిస్తారా లేదా ఈఎంఐ లో తీసుకుంటారు అని ముందు అడిగి ఆ తర్వాత వస్తువు ధర ఎంత అన్న విషయాన్ని చెబుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Emi

సంబంధిత వార్తలు: