అంతర్జాతీయం : భారతసంతతికి.. పెరుతున్న ప్రాధాన్యత..!
లీనా ప్రస్తుతం లండన్ కేంద్రంగా ఉన్న యూనీలీవర్ సంస్థ లో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ గా ఉన్నారు. జనవరి లో చావెల్ సీఈఓ బాధ్యతలు స్వీకరించనున్నారు. లీనా మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పుట్టారు. ప్రాథమిక విద్య స్వగ్రామంలో పూర్తిచేసి, అనంతరం వాల్ చాంద్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తరువాత జంషెడ్ పూర్ లోని జేవియర్ స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ లో మేనేజ్మెంట్ డిగ్రీ(గోల్డ్ మెడల్) సాదించారు. అనంతరం 1992 నుండి యూనీలీవర్ లో మేనేజ్మెంట్ ట్రైనీ గా చేరారు. ఆ సంస్థలోనే పలు కీలక పదవులను ఆధిరోహించారు. భారత్ లోనే బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర లలోని యూనీలీవర్ యూనిట్లలో కూడా ఆమె విధులు నిర్వర్తించారు. 2016 నుండి లండన్ లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అలాగే ఓమ్నికామ్ మీడియా గ్రూప్ ఇండియా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మరో భారతీయ సంతతి(అనిషా అయ్యర్)కి పదవి లభించింది. అయ్యర్ కు డిజిటల్ టెక్ సహా వ్యాపారరంగంలో 18 ఏళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉంది. 2019లో ఆమె మలేషియా కు అనుబంధంగా ఉన్న ఓమ్నికామ్ మీడియా సంస్థలో చేరారు. గతంలో ఆమె మైండ్ షేర్, మ్యాడ్ హౌస్, గ్రూప్ కామ్ లలో విధులు నిర్వర్తించారు. ఎఫ్ ఎంసిజి, ఫార్మా, ఆటో, ట్రావెల్, టెలికాం, ఈ-కామర్స్, ఆహారం మరియు రిటైల్ వ్యాపారాలలో ఆమెకు గణనీయమైన అనుభవం ఉంది. ఓఎండి అనేది అంతర్జాతీయ మీడియా నెట్ వర్క్ యొక్క భారతీయ విభాగం. ఈ మీడియా గ్రూప్ లో ఓఎండి, హార్ట్ అండ్ సైన్స్, పీహెచ్ డి వంటి మీడియా ఏజెన్సీలు ఉన్నాయి. భారతీయ 2020 ప్రకటనల విలువ 564బిలియన్ గా ఉండగా, ఇది 2022నాటికి 700బిలియన్లు కాగలదని అంచనా వేస్తున్నారు.