అమెరికాతో.. రిలయన్స్.. !
అయితే రిలయన్స్ రిటైల్ లో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విలీనం పై అమెజాన్ తో న్యాయ పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో రిలయన్స్ మరో అమెరికా సంస్థతో జతకట్టడంపై ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందంతో రిలయన్స్ తన కొత్త జట్టు 7-ఎలెవెన్ వ్యాపార పద్దతిని అలవరచుకోనుంది. ఈ విషయంపై 7-ఎలెవెన్ అప్పుడే స్టాక్ ఎక్స్చేంజి కి సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులకు ఉత్తమమైన నాణ్యత కలిగిన వస్తువులను అందుబాటులోకి తేగలమని రిలయన్స్ సంస్థ తెలిపింది. అలాగే తాము కూడా రిలయన్స్ కు అనేక వ్యాపార పద్దతులను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని 7-ఎలెవెన్ తెలిపింది.
గతంలో ఇదే 7-ఎలెవెన్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ తో జట్టుకట్టాలని చూసింది. కానీ అది రద్దవటంతో రిలయన్స్ ఆ అవకాశాన్ని దక్కించుకుంది. గత రెండేళ్లుగా 7-ఎలెవెన్ సంస్థ భారత్ లో అడుగుపెట్టేందుకు చేస్తున్నప్పటికీ సరైన దక్కక పోవడం వలన అది కుదరలేదు. ఫ్రాంచైజ్ కోసం చెల్లించాల్సిన రుసుము ఫ్యూచర్ చెల్లించలేకపోవడం తో ఆ ఒప్పందం రద్దు అయినట్టు తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ అనుబంధ సంస్థ ఫ్యూచర్ కూపన్స్ లో 2019 లో అమెజాన్ 49 శాతం వాటా కొనుగోలు చేయడంతో రిలయన్స్ తో ఫ్యూచర్ విలీనం కు కూడా ఆటంకాలు వచ్చి పడ్డాయి.