పత్తికి మద్ధతు ధర కల్పిస్తాం

పత్తికి మద్ధతు ధర కల్పిస్తాం
రైతుల వద్ద నుంచి ఫలితాన్ని కొనుగోలు చేస్తన్న ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్  ఈ ఏడాది నుంచి కొత్త విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనుంది.  రైతులకు రవాణా భారాన్ని తగ్గించ నుంది. ఈ విషయాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లోప్రధాన పంటలలో పత్తి కూడా ఒకటి. ఈ పంట ఫలితాన్ని మార్క్ ఫెడ్ రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. పత్తి కొనుగోలు కేంద్రాల నుంచి  కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా  (సిసిఐ)గోదాముల వరకూ రైతులే పత్తిని తమ ఖర్చులతో తరలించే వారు. ఇది కర్షకులకు మోయలేని భారమయ్యేది. దీనిని తగ్గించ్చేందుకు వై.ఎస్ .జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. రైతులపై  పడుతున్నరావాణా భారాన్ని ప్రభుత్వం భరిస్తే ఎలా ఉంటుందో ప్రయోగాత్మకంగా గత ఏడాది అమలు చేసింది. శ్రామికులైన వ్యవసాయదారుల బాగుకోసం దాదాపు 80 లక్షల రూపాయలకు పైగా వ్యయం చేసింది.  రైతుల నుంచి సంతోషం వ్యక్తం కావడంతో ఈ ఏడాది కూడా అదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య తో కలసి మంత్రి కన్నబాబు పత్తి రైతులకు ప్రభుత్వం అందస్తున్న సహాయ సహకారాలను వివరించారు. సిసిఐ నిబంధనలు అనుసరించి రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు.
పత్తి కొనుగోలులో ఎక్కడా దళారులకు ప్రవేశం ఉండదన్నారు. రాష్ట్రంలో 73 జిన్నింగ్ మిల్లుల నుంచి 50 కి పై ఏఎంసిల పత్తి సేకరించనున్నట్లు లక్షంగా పెట్టుకున్నామవ్వారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఆశయాల మేరకే తాము పని చేస్తున్నామన్న మంత్రి ఈ- పంట ద్వారా రైతులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నమని వివరించారు. నవంబర్ మొదటి వారం నుంచి  పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటు ఉంటాయన్నారు. రైతులు కానివారు ఎవరైనా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకు వస్తే అట్టి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: