ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై టీడీఎస్‌ను ఎలా తగ్గించాలంటే?

Satvika
ఈ మధ్య కాలంలో బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే వారికి తిరిగి ఇస్తారో లేదో అనే ఆలోచన ఉంటుంది. ఎక్కడైనా ఇన్వెష్ట్ చేస్తే లాభాలు ఏం వస్తాయి అని భావించే వాళ్లు స్థిర డిపాజిట్లను చేస్తారు.  కొన్ని బ్యాంకులలో ఎక్కువ వడ్డీ వస్తుంది. మరి కొన్ని బ్యాంకులలో వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి స్థిరమైన రాబడి, మూలధనం భద్రతకు హామీ ఇస్తుంది. అయినప్పటికీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది.

కొన్ని బ్యాంకులు వినియోగదారుల విజ్ఞప్తి మేరకు ఎఫ్‌డీలపై టీడీఎస్‌ను కొంతవరకు తగ్గిస్తాయి. అయితే, బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి.. అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే.. మీరు సంపాదించిన వడ్డీపై టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. వివిధ ఎఫ్‌డీలపై బ్యాంకులు 10 శాతం చొప్పున టీడీఎస్‌ను తగ్గించుకొంటాయి.

ఇకపోతే ఖాతా దారుడు పాన్ నెంబర్ జతచేసిన ఎడల అతనికి ట్యాక్స్ లో రాయితీ ఉంటుంది.ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నదని బ్యాంకుకు తెలియజేయాలి. ఫారం 15 జీ లేదా 15 హెచ్ ను బ్యాంకుకు సమర్పించాలి. ఇవి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాలు. దీనిలో మీ ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నదని రుజువులు సమర్పించాలి.60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి రూ.2.5 లక్షల లోపు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది.

60 ఏండ్ల వయసు పైబడిన వారు, 80 ఏండ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది. 80 ఏండ్ల వయసు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఇస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్‌ను నివారించడానికి మీరు ఇప్పుడు ఫారాలను సమర్పించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి... ఇలా చేయడం వల్ల టీడీఎస్ ను తగ్గించుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: