మారుతీ సుజుకీ స్విఫ్ట్‌-2021 మోడ‌ల్ విడుద‌ల‌

Garikapati Rajesh

ప్రముఖ కార్ల త‌యారీ సంస్థ మారుతీ సుజుకీ  2021 మోడల్ స్విఫ్ట్ ను భారత మార్కెట్లోకి విడుద‌ల‌ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ హ్యాచ్ బ్యాక్ ప్రారంభ ధర రూ.5.73 లక్షలు. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో దీన్ని అందుబాటులోకి తెచ్చిన‌ట్లు కంపెనీ యాజ‌మాన్యం పేర్కొంది. భార‌త‌దేశంలో కార్ల త‌యారీ రంగంలోను, అమ్మ‌కాల్లోను మొద‌టిస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ తాజాగా త‌న మ‌రో మోడ‌ల్‌ను విడుద‌ల ఏసింది. విజ‌య‌వంత‌మైన స్విఫ్ట్ మోడల్ ను దేశ మార్కెట్‌లోకి విడుద‌ల చేశారు. మారుతీ స్విఫ్ట్ వేరియంట్ ఆటోమాటిక్‌, మాన్యువ‌ల్ ధ‌ర‌ల‌ను విడివిడిగా పేర్కొన్నారు. ZXI+ డ్యూయల్ టోన్ 8.41 లక్షలుకాగా, మాన్యువ‌ల్ ధ‌ర 7.91 లక్షల రూపాయ‌లుగా ఉంది.
ఈ సరికొత్త కారులో భద్రతా పరమైన ఫీచర్లకు కొరతే లేదు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, అప్డేటెడ్ స్టీరింగ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్లు లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న పిల్లల కోసం ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ లాంటి సదుపాయం కూడా ఇందులో అమర్చారు. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమేరా తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 
కారు లోపల పరిశీలిస్తే.. ఎన్నో అధునాత ఫీచర్లను పొందుపరిచిందీ సంస్థ. క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఫోల్డబుల్ ఓఆర్వీఎం, ట్విన్ పాడ్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ రివైజ్డ్ సెట్ తో కూడిన 4.2 అంగుళాల ఎంఐడీ కలర్ట్ టీఎఫ్టీటీ స్క్రీన్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కాకుండా 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, మ్యూజిక్ కోసం స్టార్ట్ ప్లే స్టూడియో, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. నూతనంగా ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతోపాటు డ్యూయల్ వీవీటీ, ఎక్సాహాస్ట్ గ్యాస్  రీస‌ర్యులేష‌న్ వ్య‌వ‌స్థ‌ద్వారా ఈ కారు ప్రదర్శనతో పాటు మైలేజీ కూడా మెరుగ్గా ఉండనుంది.
2021 మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ అదనంగా కొత్త ఇంజిన్ ను అమర్చారు. పాత ఇంజిన్ అయిన 1.2-లీటర్ కే-సిరీస్ ఇంజిన్ స్థానంలో1.2-లీటర్ డ్యూయల్ జెట్ వీవీటీ పెట్రోల్ యూనిట్ను అమ‌ర్చారు.  ఈ నూతన ఇంజిన్ 88 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పాత ఇంజిన్ 82 బీహెచ్ పీ కంటే మెరుగైన పవర్ ఔట్‌పుట్ ఉంది. 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. మైలేజీ దగ్గరకొస్తే మ్యానువల్ వేరియంట్లు లీటరుకు గరిష్ఠంగా 23.20 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వర్షన్లు అయితే లీటరుకు గరిష్ఠంగా 23.76 కిలోమీటర్లు ఇస్తాయ‌ని కంపెనీ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: