ఏడాది పూర్తవ్వడంతో కార్ల పై భారీ డిస్కౌంట్ ఇస్తున్న టాటా మోటార్స్..

Satvika
టాటా మోటార్స్ కంపెనీ అంటే అందరికీ తెలుసు.. ఎన్నో రకాల ఆటో మొబైల్స్ వాహనాలను అందుబాటు లోకి తీసుకొచ్చింది. కార్లు, బస్సులు తదితర వాహనాలను తయారు చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది.. ఈ మేరకు ఈ ఏడాదిలో ఘన లాభాలను పొందినట్లు తన అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది.. అంతేకాదు టాటా మోటార్స్ నుంచి వచ్చిన టియాగో, టైగర్, నెక్సాన్, హారియర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలను కలిగి ఉన్న ఎంపిక చేసిన బీఎస్ 6 కంప్లైంట్ కార్లపై ఇది రూ.65,000 వరకు డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది.

ఈ భారీ డిస్కౌంట్ ను కూడా ప్రారంభించింది. అలాగే కార్ల ఎక్స్ఛేంజ్ ఆఫర్, కార్పొరేట్ ఆఫర్లను కూడా కలిగి ఉంటుంది. టాటా హారియర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మొత్తం బెనెఫిట్స్‌ రూ.65,000, వినియోగదారుల పథకం కింద రూ.25,000, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 40,000 అందిస్తున్నారు. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో ఇచ్చే డిస్కౌంట్ రూ. 25,000 వరకు ఉంటుంది. అంతేకాదు వినియోగ దారుల పథకం కింద 10 వేల నుంచి 15 వేల వరకు ఉంటుంది.

ఇకపోతే టైగర్ సెడాన్ కొత్త వాహనం కొనుగోలు పై గరిష్టంగా రూ.30,000 ప్రయోజనాలను కలిగి ఉంటుంది.. ఇందులో రూ.15,000 వినియోగదారుల పథకం, రూ.15,000 మార్పిడి ఆఫర్ ఉన్నాయి. కార్ల తయారీదారు దాని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌ లో ఎటువంటి ఆఫర్ లేదా ప్రయోజనాన్ని అందించడం అనేది ఈ కారుకు లేదని కంపెనీ వెల్లడించింది. కార్పొరేట్ వ్యక్తులు ప్రత్యేక ఆఫర్లను కూడా పొందవచ్చని కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించింది. ఇలా కొత్త వాహనాల పై ఆఫర్ తో పాటుగా పాత వాహనాలను మార్చుకోవడం పై కూడా అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది.. న్యూయర్ వస్తున్న సందర్భంలో ఈ కార్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: