ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ లకు జూలై 27 నుంచి కొత్త రూల్స్...!

Suma Kallamadi

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ షాపింగ్ కు బాగా అలవాటు పడ్డారు. ఏ వస్తువు కొనాలన్న ముందుగా ఆన్లైన్ లో వాటి గురించి చూసి, వాటి వివరాలు రివ్యూలు చూసి కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా ఉపయోగించే వారి కోసం మోడీ సర్కార్ ఒక శుభవార్త తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ-కామర్స్ కంపెనీల అన్నిటికీ కూడా కొత్త నిబంధనలను అమలు చేయబోతుంది. ఇక ఈ కొత్త నిబంధనలు జూలై 27 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. 

 

ఇక ఇటీవల కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే వినియోగదారులు పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ జూలై 27న నుంచి ఈ విషయాన్ని కష్టమర్లందరికీ తెలపబోతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ కామర్స్ కంపెనీలకు ఎటువంటి నిర్ధిష్టమైన నిబంధనలు అమల్లోకి రాలేదు. ప్రస్తుతం మాత్రం తొలిసారిగా ఈ కామర్స్ కంపెనీ లో కూడా నిబంధనలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. వాస్తవానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో ఈ కామర్స్ కంపెనీలకు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. కాకపోతే, ప్రస్తుతం కొత్త కంపెనీలు అన్నిటికీ కూడా వర్తింప చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రూల్స్ ని ప్రవేశ పెట్టపోతుంది.

 


ఇక ఇలా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొని వస్తే... ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేసి మోసపోతే ఈ కామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తగిన షరతులు విధిస్తూ.. పెనాల్టీ విధించడమే కాకుండా, కంపెనీ అధికారులను జైలు శిక్ష కూడా విధించే లాగ రూల్స్ ను  ప్రవేశ పెట్టబోతోంది. ఇక ఇందులో ఎవరైనా కస్టమర్ ఆన్ లైన్ లో ఆర్డర్ బుక్ చేసిన తర్వాత... వారికి నచ్చకపోతే క్యాన్సల్ చేస్తే ఈ కామర్స్ సంస్థ నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఆ నిబంధనను తీసుకొని రాబోతుంది.

 

ఇందులో ఒకవేళ నాణ్యతలేని ప్రొడక్ట్స్ ను కస్టమర్లకు డెలివరీ చేస్తే... కంపెనీ అధికారులు పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక ఈ ఫోన్ ఎక్స్చేంజ్ గ్యారెంటీ వారెంటీ వంటి వివరాలు అన్నీ కూడా ఈ కామర్స్ సైట్ లో కస్టమర్లకు పూర్తి వివరాలతో అందుబాటులోకి ఉండేలాగా తెలియచేయాలి అంటూ కొత్త రూల్స్ లో ఈ కామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక ఆన్లైన్ కంపెనీల సంబంధిత ఫిర్యాదులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక నోడల్ ఆఫీస్ ను కూడా నియమిస్తుంది. ఆ ఫిర్యాదులు కూడా ఒక నిర్ణీత కాలంలో పూర్తి చేయాల్సిందిగా కొత్త రూల్స్ లో కేంద్ర ప్రభుత్వం తెలియచేసింది. ఇక ఈ కొత్త రూల్స్ అన్నీ కూడా ఈ కామర్స్ సంస్థలకు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: