రేవంత్ ఏడుస్తున్నాడు - బండి అరుస్తున్నాడు.. ఇద్దరిదీ నాటకమేనా?

frame రేవంత్ ఏడుస్తున్నాడు - బండి అరుస్తున్నాడు.. ఇద్దరిదీ నాటకమేనా?

Chakravarthi Kalyan
తమ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఏడుస్తుంటే.. కేంద్రమంత్రి బండి సంజయ్ అరుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ వాస్తవానికి రేవంత్ రెడ్డి చేతులో కీలుబొమ్మగా మారిపోయారని ఆయన విమర్శించారు. కేసీఆర్‌పై దొంగనోట్ల కుట్రకు కారణం రేవంత్ రెడ్డి అని, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి కుట్రలను ఎదుర్కొనడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మీడియాతో ఎమ్మెల్సీ దాసోజు మాట్లాడారు..



కేసీఆర్‌పై ఇటీవల బండి సంజయ్ చేసిన ఆరోపణలు, చాలా ఏళ్ళ కిందట కాంగ్రెస్ నేతలు చేసిన అసత్య ఆరోపణలను అచ్చం పరికట్టు మాదిరిగా ఉన్నాయన్నారు. బండి సంజయ్ బీజేపీకి చెందిన నాయకుడిగా కాకుండా రేవంత్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ తెలంగాణలో నిజమైన ప్రజాభిమానం  కలిగిన నాయకుడైతే అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.  కేవలం బీఆర్ఎస్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని బండి సంజయ్ మాట్లాడం చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఆయనకున్న విధేయత బయటపడిందని అన్నారు. కేసీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలను చూపించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: