
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని మొగుడినే లేపేయించింది?
ఈ హత్యకేసు వివరాలను మీడియాకు వెల్లడించిన అనంతపురం గ్రామీణ పీఎస్ సీఐ శేఖర్ అసలు గుట్టు చెప్పారు. కథేంటంటే.. మృతుడు కాశీ పని చేసే టమోటా మండీ వద్ద కూలీ నవాజ్ బేగ్ తో సౌభాగ్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్యకు పక్కా ప్లాన్ వేసిన సౌభాగ్య దాన్ని అమలు చేసి మొగుడిని హత్య చేయించిందని సీఐ శేఖర్ తెలిపారు. ఈ హత్య కేసులో సౌభాగ్య, నవాజ్ తో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.