రైతుభరోసా అమలుకు చర్యలు వేగవంతం?

Chakravarthi Kalyan
రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు, సాంకేతిక కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు.

సాగుకు అనువుగాని భూములను సాంకేతిక సహాయంతో గుర్తించాలని మంత్రి తుమ్మల సూచించారు. జనవరి 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతు భరోసా పథకమన్న మంత్రి తుమ్మల.. ఈ పథకం సంబంధించిన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన విధంగా ఈ యాసంగి నుంచి వ్యవసాయానికి అనువైన భూములన్నంటికి రైతు భరోసా వర్తిస్తుందన్నారు. వ్యవసాయయోగ్యం కాని భూములను గుర్తించేందుకు సాంకేతికతను వాడుకోవాలని మంత్రి తుమ్మల అన్నారు. ఇటీవలే రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఆ డబ్బు రైతులకు అందించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: