చంద్రబాబు త్వరపడకపోతే కష్టం.. మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్?
కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణాకి జరిగిన అన్యాయంపై నేను సీఎంగా ఉన్నప్పుడు సుప్రీం కోర్టులో స్టే తెచ్చాం.. ఆ స్టే ఇప్పటికీ అలాగే ఉంది. ఇద్దరు సీఎంలు కలిసికట్టుగా కృష్ణా జలాలపై శ్రద్ద పెట్టాలి. అమరావతిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఎంత వేగంగా అభివృద్ది చేస్తే, అంతకంటే వేగంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు.
ఏపీ అప్పుల మయంగా మారిందని.. అభివృద్దిలో బాగా వెనుకపడ్డాం.. వేగంగా అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జమిలీ ఎన్నికల బిల్లుతో పాటు పలు బిల్లులు అమలు జరగాల్సి ఉంది. కరోనా వంటి గడ్డు పరిస్థితుల వల్ల సెన్సెక్ జరగలేదు. ఇప్పుడు సెన్సెక్ వేగంగా సాగుతుందని.. జగన్ కి బీజేపీ సపోర్టు చేస్తుందని అనడం సరికాదు. అది కోర్టుల్లో ఉన్న వ్యవహారం. సీబీఐ, ఈడీ, కోర్టులకి సంబంధించినది. ఏడాదిలోపే విచారణ పూర్తి కావాల్సి ఉన్నా, ప్రజాస్వామ్యంలో లొసుగుల వల్ల ఆలస్యం అవుతుండవచ్చని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.