మరో బీఆర్‌ఎస్ నేత అరెస్ట్.. మళ్లీ రచ్చరచ్చ తప్పదా?
పోలీసులు పెద్ద ఎత్తున తమ నివాసానికి రావడంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ చేస్తున్నారని ఎర్రోళ్ళ శ్రీనివాస్ వాపోతున్నారు.
అయితే.. ఎర్రోళ్ల అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన నివాసానికి బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. ఇటీవల కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది.
ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ విషయంలోనూ అదే జరగబోతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి బెదిరింపు ఎత్తుగడలకు భయపడేది లేదని.. న్యాయ పోరాటంతో వీటిని తిప్పికొడతామని గులాబీ నేతలు అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?