బంగ్లాలో హిందువుల దాడులపై స్పందించిన నటుడు..!

FARMANULLA SHAIK
సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రలు చేసినా.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మందికి ఎన్నో రకాల సహాయాలు చేసి.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఇక కరోనా సమయంలో దేశవ్యాప్తంగా సోనూసూద్ చేసిన సహాయాలు, విరాళాలు, ఇతర సేవా కార్యక్రమాలతో.. ఎంతో మంది ఆయనను దేవుడిగా కొలిచారు. ఆకలితో అలమటించిన వారికి ఆహారం, అరుదైన వ్యాధులతో బాధపడేవారికి చికిత్స, ఆర్థిక సాయం ఇలా ఒక్కటేంటి.. నోరు తెరిచి అడిగిన ప్రతీ ఒక్కరికీ సాయం చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న హిందువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేశంలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో హిందువులపై దాడులు పెరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే అక్కడ అల్లర్లు వలన 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు పొగొట్టుకున్నారు. ముఖ్యంగా ఆ దేశంలోని జరుగుతున్న ఈ అల్లర్లుకు వలస వెళ్లిన హిందువుల పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో బంగ్లాదేశ్ లోని హిందువుల మారణహోమం ఎలా జరుగుతుందో, ఎంతటి ప్రభావం చూపుతుందో ఓ బంగ్లాదేశ్ హిందూ మహిళ వీడియో ద్వారా పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో పై తాజాగా ప్రముఖ స్టార్ హీరో సోనూ సూద్ స్పందించి కీలక ప్రకటన చేశారు.
తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన హిందూ మహిళ  ఆ వీడియోలో  తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ‘తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను  కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని’ కోరింది. ఇక  ఈ వీడియో  కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అయితే ఈ వీడియో స్టార్ నటుడు సోనూ సూద్ కంట పడటంతో.. దానిని చూసిన  చలించుకుపోయాడు. వెంటనే ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తే ఓ పోస్ట్ చేశాడు.  ఇక ఆ పోస్ట్ లో సోనూ సూద్.. ”బంగ్లాదేశ్ నుంచి మన తోటి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు.ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని.. ప్రజల అందరిదీ అంటూ పేర్కొన్నారు. చివర్లో జై హింద్ అంటూ సోనూసూద్ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సోనూసూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: