రెండో రోజూ సమ్మె.. మంత్రులు స్పందించాల్సిందే?

Chakravarthi Kalyan
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు కూడా వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఆసుపత్రుల్లో ప్రతిష్టంభన నెలకొంది. నిన్న మధ్యాహ్నం వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఆ తర్వాత డిఎంఈ తో చర్చలు సైతం విఫలం అయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు యథాతథంగా సమ్మె కొనసాగిస్తున్నారు.
అయితే చర్చల్లో కొన్ని సమస్యల పరిష్కారానికి సర్కారు సానుకూలంగానే స్పందించింది. కానీ.. అన్ని డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు పట్టుదలతో ఉన్నారు. అందుకే సమ్మెతో ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. జూనియర్ డాక్టర్లు సమ్మెలకు దిగడం ఇదేమీ కొత్త కాదు. ప్రభుత్వాలు మారుతున్నా ఇలా జూనియర్ డాక్టర్ల అసంతృప్తి మాత్రం తీరడం లేదు. దీనిపై ప్రభుత్వం ఓ విధానం తీసుకురావడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: