అక్కడ రీపోలింగ్‌ కోరుతూ సుప్రీంకోర్టుకెళ్లిన వైసీపీ?

Chakravarthi Kalyan
చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయన్న మోహిత్ రెడ్డి.. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు.

హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డి పిటిషన్ పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. ఓ వైపు రేపే కౌంటింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రీపోలింగ్‌ జరపాలంటూ  వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి  పిటిషన్‌ వేయడం సంచలనం కలిగిస్తోంది. మరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: