ఇవాళ పిన్నెల్లికి సుప్రీం కోర్టులో షాక్‌ తప్పదా?

Chakravarthi Kalyan
మాచర్లలో జరిగిన ఈ వీ ఎం ధ్వంసం ఘటనలపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. పోలింగ్ రోజు ఈవిఎం పగలకొట్టి, తనపై హత్యాయత్నం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలచేని నంబూరి శేషగిరి రావు రెండు పిటిషన్లు దాఖలు చేసారు. ఈనెల 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దు అని హైకోర్టు కల్పించిన వెసులుబాటు ఎత్తివేయాలని నంబూరి శేషగిరి రావు పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.

ఈవిఎం పగలకొట్టిన కేసుతో పాటు, హత్యాయత్నం కేసులో కూడా హైకోర్టు కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ నంబూరి శేషగిరి రావు వాదించారు. నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ల వెకేషన్ ధర్మాసనం  విచారణ జరపనుంది. మరి కేసు తీవ్రత దృష్ట్యా పిన్నెల్లికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు చెబుతుందేమో అన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: