నీ ఉద్యోగం ఎందుకు పీకేయకూడదు?.. ఐఏఎస్‌పై హైకోర్టు ఫైర్‌?

Chakravarthi Kalyan
ఓ ఐఏఎస్‌ అధికారిపై ఏపీ హైకోర్టు తీవ్రంగా మండపడింది. ఐఏఎస్ అధికారి గుల్జార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఐఏఎస్ అధికారి గుల్జార్ ఉత్తర్వులు ఇవ్వడమే ఇందుకు కారణం. ఆర్థికశాఖ(వాణిజ్యపన్నులు) కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో హైకోర్టు ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్న లక్ష్మణ రేఖను ఐఏఎస్ అధికారి గుల్జార్ దాటారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానంపై ఐఏఎస్ అధికారి గుల్జార్‌కు ఎలాంటి గౌరవం లేదని, ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగేందుకు అనర్హుడని న్యాయస్థానం కామెంట్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి గుల్జార్ కు హైకోర్టు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. సుమోటో కోర్టుధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని మరో షోకాజ్‌ నోటీసు కూడా హైకోర్టు జారీ చేసింది.   ఈ కేసు తదుపరి విచారణను  మే 1కి హైకోర్టు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ias

సంబంధిత వార్తలు: