కవిత ఫ్యూచర్‌ డైలమా.. జరగబోయేది ఇదేనా?

Chakravarthi Kalyan
ఢిల్లీ మద్యం విధానం ఈడీ, సీబీఐ కేసుల్లో ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియబోతోంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ప్రత్యేక కోర్టు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. జ్యూడిషియల్ కస్టడీలో తీహాడ్ జైలులో ఉన్న కవిత.. ఇవాళ కోర్టు ముందుకు రాబోతోంది. తీహాడ్ జైలు నుంచి వర్చువల్ గా కవిత ను జడ్జి ముందు అధికారులు హాజరుపరుస్తారు.
అయితే కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టు ను కోరనున్నాయని తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం 2 గం.లకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు కొనసాగుతాయి. బెయిల్‌ కోసం కవిత చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. దీంతో మరి కొన్నాళ్లు ఆమె జైలు వాసం చేయక తప్పేటట్లు లేదు. కవిత బెయిల్‌ కోసం కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతో మంతనాలు జరుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: