ఇవాళ సుప్రీంకోర్టులో కవిత కేసు.. ఏం వాదిస్తారంటే?

Chakravarthi Kalyan
ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ల పై రౌస్ అవెన్యూ  సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఈడి, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత పిటిషన్‌ను మధ్యాహ్నం 2 గం.లకు న్యాయమూర్తి కావేరి భవేజా విచారణ చేపడతారు. ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడి అరెస్టు చేసింది. 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. తీహాడ్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఈనెల 11న అరెస్టు చేసిన సీబీఐ.. రెండు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత ఈనెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈడి, సీబీఐ కేసుల్లో ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీలో  తీహాడ్ జైల్లో ఉన్న కవిత.. రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో రెండు వేరువేరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఈడీ, సీబీఐ లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఇవాళ కవిత పిటిషన్లను విచారించనుంది. మరి ఇవాళైనా కవితకు బెయిల్‌ వస్తుందో రాదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: