తెలంగాణ వ్యవసాయంలో కొత్త ప్రయోగం?

Chakravarthi Kalyan
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని ఆన్‌లైన్ వ్యవస్థ కిందకు తీసుకొచ్చామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా నూతన్‌కల్‌లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సిన్జెంటా అగ్రికల్చరల్ కంపెనీ ఆధ్వర్యంలో అత్యాధునిక కూరగాయల విత్తన ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేశారు.  ప్రపంచ స్థాయి విత్తన ఆరోగ్య పరీక్షల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వివిధ విభాగాలు ఏర్పాటు చేశారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో వైరస్, బ్యాక్టీరియా పరీక్షలు అత్యంత సమర్థవంతంగా ప్రాసెస్ చేయగల సామర్థ్యం మూడు ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగం నుంచి 18 నుంచి 20 శాతం పైగా ఆదాయం జీఎస్‌డీపీకి సమకూరుస్తుందని, 60 శాతం ఆధారపడి ఉన్నందున విత్తన రంగంలో సీడ్ లైసెన్స్, నిల్వలు, డీలర్ల వ్యవస్థ అంతా ఆన్‌లైన్ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. పారదర్శకత, విధానాల రూపకల్పన కోసం రైతుల వివరాలు, ల్యాండ్ డేటా కంప్యూరీకరణ చేయడమే కాకుండా వ్యవసాయ పంటల నమోదు, ఇతర వివరాలు అన్నీ కూడా పరిశ్రమ, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు పాలుపంచుకునేలా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేశామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: