భలే వింత.. ఒకే రాష్ట్రం 3 వాహన రిజిస్ట్రేషన్‌ కోడ్‌లు?

Chakravarthi Kalyan
సాధారణంగా ఒక రాష్ట్రంలో వాహనాలకు ఒక రిజిస్ట్రేషన్‌ కోడ్‌ ఉంటుంది. ఏపీ అయితే.. ap అని తమిళనాడు అయితే TN అని ఇలా.. కానీ తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణలో మూడు రకాల కోడ్‌లు కనిపిస్తున్నాయి. 2014కు ముంది రఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ap పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. వాటి సంఖ్య 70,68,252 వరకు ఉంది. ఇక 2014 తర్వాత కోడ్‌ను ap నుంచి Tsకు మార్చారు.  అలా TS పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వాహనాల సంఖ్య 92,82,903 వరకు ఉన్నాయి.

తాజాగా ఈనెల 15వ తేదీ నుంచి వాహనాల నంబర్ ప్లేట్లను TGగా మార్చుతూ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఏ వాహనం అయినా రిజర్వేషన్ చేసుకున్న 15 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి  కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రమే TG పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయి. అంటే పాత వాటితో పాటు ఇప్పుడు TG వాహనాలు కూడా కనిపిస్తాయి. తెలంగాణలో  ఇప్పటి వరకు 1,63,51,155 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: