మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు?

Chakravarthi Kalyan
ఆయనో మాజీ ముఖ్యమంత్రి.. వయస్సు 81 ఏళ్లు.. ఈ వయస్సులో ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అది కూడా ఓ బాలికపై లైంగిక వేధింపులు జరిపారన్నది కేసు. లోక్‌సభ ఎన్నికలు సమయంలో బీజేపీసీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌. యడియూరప్ప పై ఈ లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ ఆరోపణలు ఇప్పుడు కన్నడ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగిందట. 17 ఏళ్ల బాలికపై బి.ఎస్‌. యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారట. ఆయనపై కర్ణాటక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇదెలా జరిగిందంటే.. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్ప దగ్గరకు వెళ్లారట. ఆ సమయంలో తన కుమార్తెను బి.ఎస్‌. యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి చెబుతున్నారు. ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేసారు. గురువారం సాయంత్రం ఆమె పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో అర్ధరాత్రి తర్వాత పోలీసులు బి.ఎస్‌. యడియూరప్ప కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: