రేవంత్‌.. ఆ పథకాన్ని పక్కకు పెట్టేశారా?

Chakravarthi Kalyan
గత ప్రభుత్వం పసల్ భీమా పథకాన్ని పక్కన పెట్టేసింది. అయితే ఈ ప్రభుత్వమైనా ఫసల్ భీమా పథకాన్ని అమలు చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ కి పీఠాల పంచాయతీ మీద ఉన్న దృష్టి రైతుల మీద లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌  హయాంలో ఎరువుల మాఫియా, విత్తనాల మాఫియా జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి కాంగ్రెస్స్ ఆలోచించాలన్న రాణి రుద్రమ రైతు ఏడ్చిన రాజ్యం .. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్టు చరిత్రలో లేదని గుర్తు చేశారు.

ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలని రాణి రుద్రమ విజ్ఞప్తి చేశారు. రైతులను అదుకోకుంటే  ఉద్యమం తప్పదని రాణి రుద్రమ హెచ్చరించారు. తెలంగాణలో నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని రాణి రుద్రమ అన్నారు. యాసంగిలో సగానికి పైగా పంటలకు కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేకపోయిందని రాణి రుద్రమ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: