తెలంగాణలో ఆ రిజర్వేషన్లు ఆపేయగలరా?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా.. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడం వివాదానికి దారి తీస్తోంది. అమిత్‌ షా ప్రకటన అప్రజాస్వామిక చర్యగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తోంది. భారతీయ జనతా పార్టీ విషపు బీజాలు నాటుతూ..సమాజంలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌ షా ప్రకటించడం అప్రజాస్వామిక చర్యగా ఆయన అభివర్ణించారు.
అమిత్ షా వ్యాఖ్యలను ఖండిచిన నిరంజన్‌ దేశానికి హోమ్ శాఖ మంత్రిగా ఉండి...ఒక వర్గాన్ని రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూడడం దుర్మార్గమని నిరంజన్‌ వ్యాఖ్యానించారు. 4శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని.. వాటిని రద్దు చేయడం బీజేపీ తరం కాదని ఎద్దేవా చేశారు. ముస్లింలను వ్యతిరేకిస్తూ మాట్లాడితే హిందువులు మద్దతిస్తారని అనుకోవడం పొరపాటని...దేశంలో హిందువులు ఒక వర్గాన్ని ఎప్పుడు వ్యతిరేకించరని నిరంజన్‌ విమర్శించారు. బీజేపీ, బిఆర్ఎస్ ఒక్కటే....చాలా కాలంగా వాళ్ళు కలిసే రాజకీయాలు చేస్తున్నారని నిరంజన్‌ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: