రేవంత్‌పై తప్పుడు వార్త.. ఆ పత్రికపై ఫిర్యాదు?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధార అసత్య వార్తలను ప్రచురించారంటూు నమస్తే తెలంగాణ పత్రికపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బేగంపేట పోలీసు స్టేషన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా, ఫేక్ న్యూస్‌ను పుట్టించి రాస్తోందని.. కాంగ్రెస్ క్యాడర్ దృష్టిని మళ్లించేలా కుట్ర పన్నిన నమస్తే తెలంగాణ వార్త దినపత్రికతో పాటు ఇతరులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

బేగంపేట విమానాశ్రయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రెండు గంటలపాటు రహస్యంగా రాజకీయ చర్చలు జరిపారని ఒక నిరాధార వార్తలు ప్రచురించిందని ఆయన ఫిర్యాదులో తెలిపారు. ఆ వార్త తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచే ఏకైక ఉద్దేశ్యంతో ప్రచురించబడిందని.. తెలంగాణ ఓటర్లలో గందర గోళాన్ని సృష్టించేందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇమేజ్‌ను దెబ్బతీయడానికి నమస్తే తెలంగాణ లో ఈ వార్త ను ప్రచురించారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: