తేలని పొత్తులు.. బాబుకు అమిత్‌షా చుక్కలు?

Chakravarthi Kalyan
బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు చుక్కలు చూపిస్తున్నారు. పొత్తులపై చర్చల కోసం వచ్చిన చంద్రబాబుతో బేరసారాలు సాగిస్తూ షాకులు ఇస్తున్నారు. తమకు సాధ్యమైనంత ఎక్కువ సీట్లు దక్కించుకునేందుకు చర్చిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ చర్చల్లో ఉన్నారు. నిన్న గురువారం రాత్రి 10.30 నుంచి 12.10 వరకు ఈ చర్చలు కొనసాగినా ఓ కొలిక్కి రాలేదు. ఇవాళ కూడా మళ్లీ చర్చించనున్నారు. బీజేపీకు కేటాయించే సీట్ల అంశంపై అనేక ప్రతిపాదనలపై చర్చలు సాగాయి. కమలం పార్టీకి  4 ఎంపీ సీట్లు, 6 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది.
అయితే తమకు 8 వరకూ ఎంపీ సీట్లు.. 15 వరకూ ఎమ్మెల్యే సీట్లు కావాలని బీజేపీ అడుగుతున్నట్టు సమాచారం. అయితే అంత ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నారట. కాస్త లెక్కలు అటూ ఇటూ అయినా మొత్తానికి ఎన్‌డీయేలో టీడీపీ చేరిక ఖరారైనట్లేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: