పీకే టాక్స్‌: జగన్‌ చేసిన అతి పెద్ద తప్పు అదే?

Chakravarthi Kalyan
అప్పులు చేసి జనానికి పంచడమే జగన్ చేసిన అతి పెద్ద తప్పు అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌. జగన్‌ ఐదేళ్ల పాలనలో భారీగా అప్పులు చేసి, ప్రజలకు తాయిలాలు ఇవ్వడమే ఏకైక పనిగా పెట్టుకున్నారన్న ప్రశాంత్‌ కిషోర్‌.. మిడిల్‌ ఇన్‌కం రాష్ట్రాల విభాగంలో ఉన్న ఏపీలో ఇది వర్కవుట్ కాదన్నారు. మూలధన పెట్టుబడి, మౌలిక వసతుల కల్పనను పూర్తిగా గాలికొదిలేయడం జగన్‌ చేసిన అతి పెద్ద వ్యూహాత్మక తప్పు అంటున్నారు ప్రశాంత్‌ కిషోర్‌.

అల్పాదాయ రాష్ట్రాల్లో ఓట్లు సంపాదించేందుకు జగన్ పాలసీ ఉపయోగపడుతుందన్న ప్రశాంత్‌ కిషోర్‌.. ఏపీ వంటి 50 శాతానికిపైగా పట్టణ ప్రజలున్న రాష్ట్రాల్లో అది వర్కవుటు కాదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు 50 శాతం ప్రజలు అర్హులు కాదని... ఆ వర్గం వారంతా అభివృద్ధి చేసే ప్రభుత్వాన్నే కోరుకుంటారని ప్రశాంత్‌ కిషోర్‌ అంటున్నారు. సమాజంలో అధికసంఖ్యలో ఉన్న చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని.. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల లబ్ధి కోసం కాదని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. ఉపాధినిచ్చే పరిశ్రమల్ని, మెరుగైన రహదారుల్ని, విద్య, వైద్య వసతుల్ని అందించే ప్రభుత్వం కోసం యువత చూస్తున్నారని ప్రశాంత్‌ కిషోర్‌ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: