ఇవాళ ఒకే వేదికపై మోదీ, రేవంత్‌.. కెమిస్ట్రీ ఎలా ఉంటుందో?

Chakravarthi Kalyan
ఇవాళ ఒకే వేదికపై ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కనిపించబోతున్నారు. రాష్ట్ర పర్యటన కోసం వస్తున్న మోదీ ఇవాళ ఆదిలాబాద్‌లో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. కొన్ని పథకాలను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.  ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై హాజరవుతున్నారు. ప్రముఖల రాక కోసం ఎనిమిది హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్‌కు  చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 10:20 గంటలకు ఆదిలాబాద్‌ వస్తారు.
హైదరాబాద్‌ నుంచి గవర్నర్‌ తమిళి సై ఉదయం 9:05 నిమిషాలకు .. సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 9:30 గంటలకు ఆదిలాబాద్‌ వస్తారు. ముగ్గురు కలిసి ఇందిరాప్రియదర్శిని మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. గతంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టేవారు. రేవంత్ మాత్రం వస్తున్నారు. వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: