వాళ్లకు రిజర్వేషన్‌ అమలు చేయాలన్న రేవంత్‌?

Chakravarthi Kalyan
దివ్యాంగులకు చట్టం ప్రకారం విద్యలోనూ ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని అధికారులు తెలపగా... దానికి అనుగుణంగా ఫైలు సిద్ధం చేసి పంపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న బోధనాస్పత్రుల్లో ట్రాన్స్ జెండర్లకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా, సరైన అవకాశాలు కల్పించేందుకు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానాన్ని తయారు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: