ఇంజినీర్లు వద్దంటున్న కేసీఆరే కొంప కూల్చారా?
రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందన్న డిప్యూటీ సీఎం భటి విక్రమార్క.. కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదని భారాస నేతలు దుష్ప్రచారం చేశారని.. ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ ఉందో.. లేదో ప్రజలు గమనించాలని అన్నారు. గత ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిందన్న డిప్యూటీ సీఎం భటి విక్రమార్క.. తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కట్టారని.. నిపుణులు, ఇంజినీర్లు వద్దంటున్నా... మేడిగడ్డ వద్ద కట్టారని.. అద్భుతంగా కట్టామని కేసీఆర్ చెప్పిన ప్రాజెక్టులు ఇవాళ పగుళ్లు పట్టాయని.. రూ.లక్ష కోట్ల నిధులు గోదావరిలో పోసి వృథా చేశారని అన్నారు.