
రేవంత్ మరో సంచలనం.. ఆ విచారణకు ఆదేశం?
గోప్యంగా ఉండాల్సిన భూములు, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడాన్ని తప్పుపట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. భూముల రికార్డుల డేటాకు భద్రంగా ఉన్నట్లేనా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. విలువైన భూములకు పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందన్న సీఎం రేవంత్ రెడ్డి.. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. భూముల రికార్డులను విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలున్నాయా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు.