హరీశ్‌రావు సీఎం కావాలంటే అదొక్కటే మార్గం?

Chakravarthi Kalyan
హరీశ్‌రావు సీఎం కావాలంటే ఆయన ఔరంగజేబు కావడమే మార్గమని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ రావు మామ కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తేనే సీఎం అవుతాడని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాలను పూర్తిగా విస్మరించిందని అందుకే ప్రజలు భారాస కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ప్రతిపక్ష హోదాను సరిగా వినియోగించుకోకుండా అసెంబ్లీకి వచ్చి సూచనలు చేయకుండా బహిరంగ సభలో పాల్గొంటున్నారని అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లోనే 23 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.  భారాస నాయకులు కొత్తగా సానుభూతి పొందే దిశగా అడుగులు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారాస నాయకులు ఉరి వేసుకున్నా కూడా ప్రజలు సానుభూతి చూపించే దశలో లేరని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: