కూతురితోనే వ్యభిచారం..హత్య కేసులో వెలుగులోకి?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సింగోటం రాము హత్య కేసులో షాకింగ్ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు విచారణ  కొనసాగుతోంది. నిందితురాలు హిమాంబి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆమె ఇంట్లో సింగోటం రామును దారుణంగా మర్మాంగాలు కోసి మరీ హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో హిమాంబిపై వివిధ పీఎస్‌లలో 5 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. మొదట 2017 లో అమ్మాయి షేక్ సనాతో వ్యభిచారం చేయిస్తూ దొరికిన హిమంబి.. ఆ తర్వాత 2018 లో రేణుకతో వ్యభిచారం చేయిస్తున్న హిమాంబిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2020 లో జూబ్లీహిల్స్‌లో వ్యభిచార వ్యాపారం చేస్తుందని పట్టుకున్నారు. 2017 లోనే మేడిపల్లి చెందిన విష్ణుకాంత్‌ను బెదిరించి రూ.3 లక్షలు కాజేసిన హిమాంబి.. 2019 లో కూతురు నసీమాను రాజు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిమాంబి తప్పుడు ఫిర్యాదు చేసిందని పోలీసులు గుర్తించారు. హిమాంబి తన కూతురితో పాటు ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: